Posts

పాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న RRR

Image
అక్టోబర్ 21 న జపాన్‌లో విడుదలైన SS రాజమౌళి RRR పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశంలో ఒక భారతీయ చిత్రానికి అత్యధిక మొదటి వారం కలెక్షన్లను నమోదు చేసింది.  మొదటి వారంలో JPY73 మిలియన్ ($495,000) వసూలు చేసింది. ఈ చిత్రం జపాన్‌లోని 44 నగరాల్లో విడుదలై జపనీస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.  ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమాలను రికార్డులను ఆర్ఆర్ఆర్ బద్దలుకొట్టింది. జపాన్‌లో భారతీయ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిందని అక్కడి రిపోర్ట్స్ చెబుతున్నాయి.  24 సంవత్సరాల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు, JPY400 మిలియన్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌తో జపాన్‌లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత SS రాజమౌళి బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది.  JPY170 మిలియన్లతో అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. వారం రోజుల క్రితం రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లారు. RRR అనేది 1920 స్వాంతంత్ర్య నాటికి సంబంధించిన మూవీ. అల్లూరి గా రామ్ చరణ్, భీమ్‌గా తారక్ తమ నటతో ఆకట్టుకున్నారు.

షారుక్ ఖాన్ నిర్మాతగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా

Image
టాలీవుడ్ లో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మరియు టాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ కి గత కొంతకాలం నుండి సరైన హిట్ పడడడం లేదు..టాక్సీవాలా తర్వాత ఆయన చేసిన డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.   ఇక పాన్ ఇండియా లెవెల్ లో పూరి జగన్నాథ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మన అందరికి తెలిసిందే..ఇలా వరుసగా మూడు డిజాస్టర్స్ వస్తే ఏ హీరో అయినా షెడ్ కి వెళ్తారు..అసలు ఆ హీరో తో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరు సాహసించరు..కానీ విజయ్ దేవరకొండ రేంజ్ వేరే..ఇన్ని ఫ్లాప్స్ వచ్చిన కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.  టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆయనకీ క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..లేటెస్ట్ గా ఈయనకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక చేయాల్సిందిగా భారీ రెమ్యూనరేషన్ తో ఒక ఆఫర్ వచ్చిందట..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస హిట్స

వాల్తేరు వీరయ్య నైజాం లో 30 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా రైట్స్

Image
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో శెరవేగంగా సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి మార్కెట్ లో మాములు క్రేజ్ లేదు..ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ కథాంశం తో సినిమా చెయ్యడమే అందుకు కారణం..ఫాన్స్ కూడా ఎప్పటి నుండో మెగాస్టార్ ఊర మాస్ అవతారం లో చూడడానికి ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ట్రేడ్ లో కూడా ఈ సినిమాకి ఉన్న డిమాండ్ మామూలుది కాదు..ఇప్పటి నుండే ప్రాంతాల వారీగా ఈ సినిమా నిర్మాతలకు అడ్వాన్స్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు..సీడెడ్ లో 15 కోట్ల రూపాయలకు మరియు అమెరికా లో 7 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి..ఇక నైజాం మరియు ఆంధ్ర బిజినెస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ లో పోటీ మొదలైంది. నైజాం లో ఈ సినిమాని 30 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా రైట్స్ మొత్తం దక్కించుకోవడానికి దిల్ రాజు రెడీ గా ఉన్నాడు..మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు మొదట్లో ఒప్పుకున్నారు..అయితే సినిమా కంటెంట్ మీద ఆ చిత్ర నిర్మాతకి బలమైన నమ్మకం ఉండడం